రైతులతో కలిసి బిఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన
రైతు భరోసా 15000 వేలు వెంటనే చెల్లించాలి
-- పెద్దమందడి బిఆర్ఎస్ నాయకులు
వనపర్తి ,తెలంగాణ ముచ్చట్లు: వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మదిగట్ల గ్రామంలో రైతులతో కలిసి బీఆర్ఎస్ నాయకులు వినూత్న నిరసన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో రైతు భరోసా 15000 ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు 12000 ప్రకటించడం రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, బిఆర్ఎస్ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తానన్న రైతు భరోసా 15 వేల రూపాయలు వెంటనే విడుదల చేయాలని పంట పొలాలలో వినూత్న నిరసన చేపట్టారు.కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలు ఇచ్చి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రైతు భరోసా12వేలు తగ్గించి నిర్ణయించడం, తెలంగాణ రైతుల నడ్డి విరుస్తూ తెలంగాణ ప్రజలందరి ఆత్మాభిమానాన్ని దెబ్బతీసిందని నాయకులు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వేణు యాదవ్, జెడ్పిటిసి రఘుపతి రెడ్డి, మాజీ సింగల్ విండో చైర్మన్ శ్రీనివాస రెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీపీ దయాకర్,బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు శివారెడ్డి, సేనాపతి, చిత్తూరు కృష్ణారెడ్డి, రఘువర్ధన్ రెడ్డి, సతీష్, మల్ల సురేష్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments