జిల్లా పరిషత్ పాఠశాలలో నోట్‌బుక్స్ పంపిణీ
Views: 3
On
సత్తుపల్లి,తెలంగాణ ముచ్చట్లు:
సత్తుపల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ కీ.శే. మట్టా ఆరోగ్యమ్మ వర్ధంతి సందర్భంగా విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.
“నేను కూడా ఈ పాఠశాలలోనే చదివాను. ఇక్కడి విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేందుకు పాఠశాల పేరు మీద రూ. 5 లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తానని నిర్ణయించుకున్నాను,” అని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గాదె చెన్నకేశవరావు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు చల్లగుల్ల నరసింహారావు, దొడ్డా శ్రీనివాసరావు, మైనార్టీ నాయకులు ఫయాజ్, మానుకోట ప్రసాద్, విజయ సారధి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
16 Jan 2025 21:37:19
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
Comments