బంజారాలను గుర్తించిన బీజేపీ
వనపర్తిలో గిరిజనులకు బీజేపీ పెద్దపిట
జిల్లాలో మొదటిసారిగా రేవల్లి మండల అధ్యక్షుడు గా సభవత్ బాలు నాయక్
హర్షం వ్యక్తం చేసిన జిల్లా గిరిజనులు
వనపర్తి ,తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి జిల్లా భారతీయ జనతా పార్టీ అనగారిన వర్గాల వైపు అడుగులు వేస్తుందని చెప్పుకోవడానికి రేవల్లి మండలం అనగారిన వర్గాలను గుర్తించిందని చెప్పుకోవచ్చు. వనపర్తి నియోజకవర్గంలో నాటి నుండి నేటి వరకు బంజారా గిరిజనులను రాజకీయంగా గుర్తించడం చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. ఇటీవల అగ్రవర్ణాలతోపాటు అనగారిన వర్గాలను భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనలో గుర్తింపు కొనసాగుతుందని చెప్పుకోవడానికి రేవల్లి మండలం ఆదర్శమని పెద్దమందడి మండల బీజేపీ ఉపాధ్యక్షుడు కిషన్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. భారతీయ జనతా పార్టీ స్ఫూర్తి దాయకంతో నరేంద్ర మోడీ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారథ్యంలో వనపర్తి జిల్లా అధ్యక్షుడు డి నారాయణ అధ్యక్షతన ఇటీవల రేవల్లి మండలానికి చెందిన బంజారా నాయకుడు సభవత్ బాలునాయకును మండల అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగిందని వారు తెలిపారు. వనపర్తి నియోజకవర్గం లో మొదటిసారిగా భారతీయ జనతా పార్టీ ఎస్టీలను మండల అధ్యక్షునిగా నియమించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ మరో మారు బడుగు బలహీన వర్గాలను గుర్తించి ఉన్నతమైన పదవులను అధిరోహించే విధంగా కృషి చేస్తుందని బంజారా నాయకులకు పెద్దపీట వేస్తుందని వారు తెలిపారు. రేవల్లి మండలంలో భారతీయ జనతా పార్టీ బంజారా నాయకులను గుర్తించి రేవల్లి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా సభవత్ బాలునాయకును నియమించడంతో వనపర్తి జిల్లాలో బంజారా నాయకుల ఆధ్వర్యంలో ఆనందోత్సవాలు తెలపడం జరిగిందని వారు తెలిపారు.
Comments