నిరుపేద ప్రజలకు ఎంతోఅండగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం

వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు,

నిరుపేద ప్రజలకు ఎంతోఅండగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం

హసన్ పర్తి,తెలంగాణ ముచ్చట్లు;

కళ్యాణ లక్ష్మి,షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్.నాగరాజు పంపిణీ చేశారు.హనుమకొండ సుబేదారి లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హాసన్ పర్తి మండల పరిధి లోని వివిధ గ్రామాలకు చెందిన కళ్యాణలక్ష్మి, షాదీముభారక్  26 మంది లబ్ధిదారులకు 26 లక్షల 3వేల 16 రూపాయల విలువగల చెక్కులను వర్ధన్నపేట ఎమ్మెల్యే పంపిణీ చేసి మాట్లాడుతూ నిరుపేద ప్రజలకు ఎంతోఅండగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం నిలుస్తుందని అన్నారు.ఈ పథకం తెలంగాణ ప్రభుత్వం ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందుతుందని కళ్యాణ లక్ష్మి,  షాదీ ముబారక్ పథకం తో రాష్ట్రంలోని ఎంతో మంది పేద కుటుంబాలకు ఆడపిల్లల పెండ్లి భారం తగ్గిందని పేర్కొన్నారు.పది సంవత్సరాల కాలంలో ఒక రేషన్ కార్డు కూడా ఇవ్వలేదని కాంగ్రెస్ ప్రభుత్వం జనవరి 26 తర్వాత కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్రుందని రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలవడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.వచ్చే కొత్త సంవత్సరం నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన తులం బంగారం గ్యారెంటీ కూడా అమలులోకి రావాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో  ఆత్మకూరు ఎయంసి వైస్ చైర్మన్ తంగేళ్లపల్లి తిరుపతి, కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రం నరసింహ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ బిల్లా ఉదయ్ రెడ్డి, మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, 65 డివిజన్ అధ్యక్షుడు అయ్యాల రాంరెడ్డి, కాంగ్రెస్ నాయకులు తోకల లక్ష్మారెడ్డి, మండల ఉపాధ్యక్షుడు మంద రాజు,ఎల్ఐసి వెంకన్న, మాజీ సర్పంచ్ మదన్ గౌడ్, మండల మహిళా అధ్యక్షురాలు జోరిక పూల, బత్తుల స్వాతి, మాజీ మండల యూత్ అధ్యక్షుడు సౌరంచరణ్,  కనపర్తి కిరణ్, గొర్రె కిరణ్, భగత్,  భూక్యా రాజు, పొన్నాల రఘు, వీసం సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...