హలో మాదిగ.. చలో హైదరాబాద్
మందకృష్ణ మాదిగ పిలుపు
లక్ష డప్పులు వేయి గొంతుల పాటల సిడి ని ఆవిష్కరించిన మందకృష్ణ మాదిగ
ఖమ్మం లోని ఎన్ 7 స్టూడియోస్ లో అట్ట హసంగా సిడి ఆవిష్కరణ వేడుకలు
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
వచ్చే నెల ఫిబ్రవరి 7న హైదరాబాద్ లో తలపెట్టిన లక్ష డప్పులు వేయి గొంతుల కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు రూపొందించిన పాటల సిడి ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు, ఎస్సీ వర్గీకరణ ఆశాజ్యోతి మన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆవిష్కరణ చేశారు.
ఖమ్మం లోని మామిళ్లగూడెం ఆర్ అండ్ బి అతిథి గృహం సమీపంలో ఉన్న ఎన్ 7 స్టూడియోస్ లో ఈ పాటల సిడి ని ప్రజా యుద్ధ నౌక ఏపూరి సోమన్న తో కలిసి మంద కృష్ణ మాదిగ అట్ట హసంగా గురువారం ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ... హైదరాబాదులో జరిగే లక్ష డప్పులు... వేల గొంతు కుల కార్యక్రమం కానీ విని ఎరుగని రీతిలో జరగబోతుందని, ఎస్సీ వర్గీకరణ ను రాష్ట్రంలో తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూలల నుంచి కళాకారులు, మేధావులు సబండవర్గాలు తరలిరాబోతున్నాయని తెలిపారు. ఎస్సీల న్యాయబద్ధమైన డిమాండ్ ఎస్సీ వర్గీకరణను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తలపెట్టిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ఫిబ్రవరి 7 న లక్షలదిగా హైదరాబాద్ తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.
ఖమ్మంలోని ఎన్ 7 స్టూడియోస్ రికార్డింగ్ థియేటర్ చైర్మన్ నందిగామ రాజ్ కుమార్ జానీ ఆధ్వర్యంలో 20 పాటలతో సిడి ని రూపొందించడం అభినందనీయమని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజా యుద్ధ నౌక ఏపూరి సోమన్న,గిద్దే గళం గిద్దె రామ నర్సయ్య, ఎన్7 స్టూడియోస్ రికార్డింగ్ థియేటర్ చైర్మన్ నందిగామ రాజ్ కుమార్ జానీ,మ్యూజిక్ డైరెక్టర్ బొమ్మేర అరవింద్,వినయ్, బలరాం,దగ్గుపాటి రమా దేవి,సినిమాటిక్ శ్యామ్,సినిమా డైరెక్టర్ సాయి,సింగర్ అక్బర్,రచయిత కొమ్మురవి,టెక్నీకల్టీమ్వాసు,కిరణ్,ప్రసాద్,శ్రావణ్,సందీప్,ముష్టికుంట్ల ప్రవీణ్, జాక్సన్ పలువురు జర్నలిస్టులు, నగర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
Comments