సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి నేతన్నలు పాలాభిషేకం
ప్రభుత్వా నిర్ణయం పట్ల హర్షం వ్యక్తం చేసిన చేనేత కార్మికులు
-- వెల్టూర్ ఉన్ని చేనేత సహకార సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో ఉన్ని చేనేత సహకార సంఘం అధ్యక్షులు సి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చేనేత కార్మికులు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలభిషేకం చేశారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేనేత అభయహస్తం పథకాన్ని తీసుకొచ్చి, ఈ పథకం కింద నేతన్నల సంక్షేమానికి ప్రభుత్వం రూ.168 కేటాయించిందని వెంకటేశ్వర్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ వల్ల ఎంతోమంది చేనేత కార్మికులకు మేలు జరుగుతుందన్నారు. చేనేత కార్మికుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నేతన్న పొదుపు, నేతన్న భద్రత, నేతన్న భరోసా మూడు పథకాలను అమలు చేయడం సంతోషంగా ఉందని అన్నారు. ఈ పథకాలను ప్రవేశపెట్టి ఆమోదించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి లకు చేనేత కార్మికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బెల్ట్ ఉంది చేనేత సహకార సంఘం అధ్యక్షులు సి. వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, బాలచంద్రయ్య, వెల్టూర్ చేనేత కార్మికులు పాల్గొన్నారు.
Comments