కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్‌ఎస్ నాయకులు
సత్తుపల్లి,తెలంగాణ ముచ్చట్లు:
సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీకి భారీ బలాన్నిచ్చేలా బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరారు. పెనుబల్లి మండలం వి.యం. బంజార్ గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నాయకులు మాజీ సర్పంచ్ భూక్య పంతులు, మండల ప్రధాన కార్యదర్శి భూక్య ప్రసాద్‌తో పాటు బానోత్ బాలాజీ, ఏ. భద్ర, టీ. రాములు, హరియా, శంకర్, సత్యం, సోము, బాలాజీ నాయక్ తదితరులు బీఆర్‌ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా మట్టా దయానంద్ మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు ప్రజలకు మరింత సేవ చేయడానికి అనుకూలంగా పనిచేస్తారని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో పెనుబల్లి మండల కాంగ్రెస్ నాయకులు సోమరాజు సీతారామరావు, కీసరి శ్రీనివాసరెడ్డి, వంగా దామోదర్, మిట్టపల్లి కిరణ్, మాజీ ఎంపీటీసీ వంగా ఝాన్సీ, నిరంజన్ గౌడ్, మేకతోటి కృష్ణయ్య, గోగినేని రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments