పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది

కాంగ్రెస్ జిల్లా నేత కొప్పుల చంద్రశేఖర్ 

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది

* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత 

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

 పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి సహాయ నిధి  ( సీఎంఆర్ఎఫ్) ఒక వరం లాంటిదని కాంగ్రెస్ జిల్లా నేత  కొప్పుల చంద్రశేఖర్  అన్నారు. ఖమ్మం నగరంలోని రాపర్తి నగర్ కు చెందిన ఎలగందుల విజయలక్ష్మి.. హైదరాబాద్ లోని నిజాం వైద్య, విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి  సిఫారసుతో రూ.1,05,000 ఎల్ఓసీ పత్రo మంజూరైనట్లు తెలిపారు. ఈ మేరకు గురువారం..ఖమ్మంలోని గట్టయ్య సెంటర్ లో గల ఎంపీ క్యాంప్ కార్యాలయంలో..ఎలగందుల విజయలక్ష్మి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ జిల్లా నేత కొప్పుల చంద్రశేఖర్ ఎల్ఓసీ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదలకు మెరుగైన, అత్యవసర చికిత్స అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని అన్నారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి చొరవతో.. ఇప్పటికే  అనేకమందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరు చేశామని తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి.. ఇందిరమ్మ ప్రభుత్వం కృషి చేస్తోందని  అన్నారు. ఈ కార్యక్రమంలో.. బాధిత కుటుంబ సభ్యులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...