కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను మోసం చేసింది.
ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
కేటీఆర్ పై అక్రమకేసులను
నిరసిస్తూ
- ఆందోల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మౌనప్రదర్శన.
ఆందోల్ తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నియంత పాలన కొనసాగుతుందంటూ కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలు అమలు చేయకుండా ఇచ్చిన హామీల అమలు చేయాలంటూ పట్టుబడుతున్న బీఆర్ఎస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం నిరసిస్తూ బుధవారం సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో భారీ మౌన ప్రదర్శన నిర్వహించారు . ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ నాయకత్వంలో వందలాది మంది మౌనన ప్రదర్శనలో పాల్గొన్నారు . ఈసందర్భంగా మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని వాటిలో ప్రధానమైన రైతులకు ఇస్తానన్న భరోసా 15,000 ఇవ్వాలని, మహిళలకు 2500 ఇవ్వాలని , పింఛన్లను ఇవ్వాలని, దళిత బంధు, బిసీ బందు, మైనార్టీ బందుతో పాటు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వీటిని అమలు చేయాలంటూ ప్రభుత్వంతో పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకులు మీద బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతల మీద తప్పుడు కేసులు బనాయించిన అక్రమ అరెస్టులకు ప్రయత్నిస్తున్నారంటూ జోగిపేటలోని పార్టీ కార్యాలయం నుంచి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వరకు మౌన ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద, ఓ అంబేద్కరా... ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. నీవే కాపాడాలి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాజ్యాంగ హక్కులకు రక్షణ లేకుండా పోయిందని తెలంగాణలో పౌరులకు మాట్లాడే హక్కు కూడా లేకుండ పోయింది అంటూ రాసిన వినతిపత్రాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అందజేశారు . ఈ కార్యక్రమంలో జెడ్పి మాజీ చైర్మన్ జైపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు మాసాంపల్లి నారాయణ తో వివిధ మండలాల పార్టీ అధ్యక్షులు వీరప్ప, లింగ గౌడ్, వీర రెడ్డి, విఠల్, నాగభూషణం, వెంకన్న, రమేష్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కమ్మరి సిద్దయ్య, నాయికోటీ భాస్కర్, చింతా రవి, గోవింద చారి, మల్లేశం, కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comments