ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

మహిళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వివిధ పథకాల ద్వారా అందించే తోడ్పాటును వినియోగించుకొని ఆర్థికంగా బలపడాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. 
గురువారం జిల్లా కలెక్టర్, పెనుబల్లి మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 5 ఇందిరా మహిళా శక్తి యూనిట్లను ప్రారంభించారు. 
పెనుబల్లి మండలంలో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం క్రింద నూతనంగా ఏర్పాటు చేసిన సాయి డిజిటల్ స్టూడియో అండ్ వీడియో, నైస్ ఫ్యాషన్ డిజైనర్ అండ్ టైలరింగ్, ఎన్ఎన్ బ్యూటీ పార్లర్, ఎంఎన్ ఫ్యాషన్స్ లేడీ వియర్, శ్రీ హనుమాన్ టైలర్స్ యూనిట్ లను కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ తోడ్పాటుతో ప్రారంభించిన వ్యాపార యూనిట్లను మహిళలు చాకచక్యంగా నడిపిస్తూ లాభాలు అర్జించాలని తెలిపారు.  వ్యాపారాలకు అవసరమైన సామాగ్రిని నాలుగు చోట్ల పరిశీలించి, నాణ్యతతో తక్కువ ధర ఉన్న దగ్గర నుంచి కొనుగోలు చేయాలని, ప్రస్తుత మార్కెట్ ట్రెండ్స్ అనుగుణంగా వ్యాపారం కొనసాగించాలని కలెక్టర్ సూచించారు. WhatsApp Image 2025-01-16 at 8.55.57 PM
మహిళలు తాము తయారు చేసే ప్రొడెక్ట్ ప్యాకింగ్, వాటికి బ్రాండింగ్ కల్పించడంపై దృష్టి సారించాలని అన్నారు. మహిళా శక్తి యూనిట్ లో గ్రౌండింగ్ తో పాటు అవి విజయవంతంగా నడిచేందుకు అవసరమైన సహాయ, సహకారాలు, చేయాల్సిన బాధ్యత మనపై ఉంటుందని, దీని కోసం మహిళలకు వ్యాపార దృక్పథం, అధికంగా లాభాలు ఎక్కడి నుంచి రాబట్టాలనే ఆలోచన సరళి రావాలని, తక్కువ రిస్క్ తో  వ్యాపారాలు ఎలా చేయాలి వంటి అంశాలు మహిళలకు నేర్పించాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో కల్లూరు ఆర్డీవో రాజేందర్, అదనపు డిఆర్డీవో నూరొద్దీన్, పెనుబల్లి మండల తహసీల్దార్ ప్రతాప్ ఎంపిడివో అన్నపూర్ణ, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...