నారాయణపురం రండి...!
సింగరేణి గెస్ట్ హౌస్ నిర్వహణ పై మంత్రి పొంగులేటి అసంతృప్తి
Views: 1
On
- కల్లూరు మండలం నారాయణపురానికి ఆదివారం వచ్చి కలవాలని సిబ్బందికి ఆదేశాలు
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్వంచలోని సింగరేణి గెస్ట్ హౌస్ నిర్వహణ పై అసంతృప్తి వ్యక్తం చేశారు. పాల్వంచ పర్యటనకు శనివారం వచ్చిన ఆయన కాసేపు విశ్రాంతి తీసుకునేందుకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఎంఎల్ఏలతో కలిసి గెస్ట్ హౌస్ కు వచ్చారు. ఈ సందర్భంలో అక్కడ సిబ్బంది చేసిన ఏర్పాట్లను చూసి అసహనం వ్యక్తం చేశారు. గదులు శుభ్రంగా లేకపోవడం, నిర్వహణలో లోపం ఉండటంతో అక్కడ ఉన్న సిబ్బందిని పిలిపించి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఉదయాన్నే కల్లూరు మండలం నారాయణ పురం గ్రామంలోని తన నివాసానికి సింగరేణి గెస్ట్ హౌస్ నిర్వహణ అధికారులు, సిబ్బంది అందరూ రికార్డ్స్ తీసుకుని హాజరు కావాలని ఆదేశించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
16 Jan 2025 21:37:19
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
Comments