మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.
ఇందిర మహిళా శక్తి పథకంతో మహిళల్ని కోటిశ్వర్లుగా తయారు చేయాలి.
- ఈ సం: లో 100 కోట్ల రూపాయల మహిళలకు పంపిణీ చేయాలనీ లక్ష్యంగా పెట్టుకున్నాం.
- మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వారు నిలబడాలి.
మహిళలు స్ఫూర్తిగా ఉండాలి
- 20 రకాల యూనిట్స్ అందుబాటులో
మెదక్ జిల్లా తెలంగాణ ముచ్చట్లు:
ఇందిర మహిళా శక్తి పథకంలో బాగంగా సంచార చేపల విక్రయ వాహనము పంపిణీ కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్స్థానిక కలెక్టర్ కార్యాలయం ముందు బుధవారం ఇందిర మహిళా శక్తి పథకంతో భాగంగా సంచార చేపల విక్రయ వాహనము పంపిణీ నర్సింగి మండలం కల్యాణి అనే మహిళకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ. మహిళా సాధికారతే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రభుత్వ ప్రతిష్టాత్మక పధకం ఇందిరా మహిళా శక్తి అని ఈ పథకం ద్వారా మహిళలని కోటీశ్వరులుగా తయారు చేయాలన్నారు. మహిళలకు మంచి ఆదాయం వచ్చి వాళ్ల కాళ్ల మీద వాళ్లు నిలబడి, స్ఫూర్తిగా ఉండాలని పిలుపునిచ్చారు. మహిళలకు ఇందిరా మహిళా శక్తి పథకంలో మీసేవ, పౌల్ట్రీ, నాటు కోళ్లు పెంపకం, క్యాంటీన్లు ఇతర 20 రకాల యూనిట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు లక్ష్యంగా పెట్టుకొని మహిళలకు పంపిణీ చేస్తున్నామన్నారు. నార్సింగ్ మండలానికి చెందిన కళ్యాణి అనే మహిళకు రుణము ,ఇతర సబ్సిడీతో 10 లక్షల వరకు రుణం పొందిందన్నారు.ఇలాంటి అవకాశాలను మహిళలు అందిపుచ్చుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈఓ ఎల్లయ్య ,డిఆర్డిఏ శ్రీనివాసరావు ,అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments