మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...
జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కస్తాల సత్యనారాయణ
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న జిల్లా లోని ఏడు తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు ఆన్లైన్ లో దరఖాస్తు సమర్పించాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి కస్తాల సత్యనారాయణ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
2025-26 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ల ప్రక్రియ జనవరి 18 నుండి మొదలై ఫిబ్రవరి 28 వరకు ముగియనున్నదని, 5వ, 6వ, 7వ, 8వ తరగతులలో పాఠశాలల యందు, ఇంటర్మీడియేట్ లో కళాశాలల యందు చేరగోరు అర్హులైన విద్యార్ధిని, విద్యార్ధులు www.tmreistelangana.cgg.gov.in వెబ్ సైట్ నందు తమ దరఖాస్తు వివరాలు నమోదు చేసుకోవాలని, ఇందులో 75శాతం మైనారిటీస్ (ముస్లిమ్స్, క్రిస్టియన్స్, పార్సిస్, జైన్స్, సిక్కులు, బుద్ధిస్ట్స్), 25 శాతం నాన్ - మైనారిటీస్ (ఎస్.సి, ఎస్.టి, బి.సి & ఓసి) ల కొరకు సీట్లు రిజర్వు చేయబడినట్లు, ప్రతి క్యాటగిరిలో అనాధలు, వికలాంగులు, వితంతువుల, సైనిక ఉద్యోగ/ విశ్రాంత ఉద్యోగుల పిల్లలకు 3 శాతం రిజర్వు చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్ధిని, విద్యార్ధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఇతర వివరాలకు ప్రిన్సిపల్స్, మైనారిటీ గురుకుల పాఠశాలలు వారిని సంప్రదించాలని జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికారి కస్తాల సత్యనారాయణ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
Comments