జర్నలిస్ట్ ముఖేష్ ను హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి
టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి
◆ టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
జాతీయ మీడియా జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ ను పాశవికంగా హత్యచేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవిలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
టియుడబ్ల్యూజే (టీజేఎఫ్) రాష్ట్ర నాయకత్వం పిలుపులో భాగంగా జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ హత్యను నిరసిస్తూ మంగళవారం ఖమ్మం నగరంలో పెవిలియన్ గ్రౌండ్ నుంచి మయూరి సెంటర్ మీదుగా జిల్లా పరిషత్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వరకు ద్విచక్ర వాహనాలతో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం సాక్షిగా జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ ను హత్య చేసిన నిందితులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలని జర్నలిస్టులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆకుతోట ఆదినారాయణ మాట్లాడుతూ... 120 కోట్ల రూపాయల రోడ్డు కాంట్రాక్ట్ పనిలో జరుగుతున్న అవినీతిని వార్త రూపంలో బయటపెట్టినందుకు జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ ను అత్యంత పాశవికంగా హత్య చేసి సెప్టిక్ ట్యాంక్ లో డెడ్ బాడీని దాచి పెట్టడం బాధాకరం అన్నారు. వృత్తి పరంగా వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తూ అవినీతిని బయటపెట్టె జర్నలిస్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భద్రత కల్పించడంలో పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు. జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టులకు రక్షణ కల్పించే విధంగా పటిష్టమైన చట్టాలు తీసుకురావాలని ఆయా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదినారాయణ డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు ఆర్.టి.వి ఉదయ్, మందుల ఉపేందర్, టీఎస్ చక్రవర్తి, వీడియో జర్నలిస్టు అధ్యక్షులు నాగరాజు, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా సహాయ కార్యదర్శి షేక్ జానీపాషా, శ్రీధర్ శర్మ, నగర కార్యదర్శి
అమరవరపు కోటేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్ష, కార్యదర్శులు గుద్దేటి రమేష్ బాబు, కొరకొప్పుల రాంబాబు, కోశాధికారి బిక్కి గోపి, ఉపాధ్యక్షుడు ముత్యాల కోటేశ్వరరావు, సహాయ కార్యదర్శి మూల జీవన్ రెడ్డి, టెంజూ నగర కార్యదర్శి కరీష అశోక్, సాయి, శ్రీనివాస్, నగేష్, వెంకటేశ్వరరెడ్డి, మదర్ సాహెబ్ ,మోహన్, వెంకటేశ్వర్లు, బాబు, రాజేంద్రప్రసాద్, కృష్ణారావు, మక్కా రవీందర్, మీడియా ఇంచార్జ్ తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.
Comments