గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరించిన కలెక్టర్
హన్మకొండ,తెలంగాణ ముచ్చట్లు:
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్య చేతుల మీదుగా తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ హనుమకొండ జిల్లా 2025 క్యాలెండర్ గురువారం ఆవిష్కరించబడింది.ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా కలెక్టర్ ప్రావిణ్య మాట్లాడుతూ, “గెజిటెడ్ అధికారులు జిల్లా అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలను విజయవంతంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అధికారుల సమస్యలను పరిష్కరించేందుకు నాకెప్పుడూ సిద్ధంగా ఉంటాను. గెజిటెడ్ అధికారుల సంఘ భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు పూర్తి సహకారం అందిస్తాను,” అని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్నమనేని జగన్ మోహన్ రావు, జిల్లా అధ్యక్షులు దాసరి మురళీధర్ రెడ్డి, కార్యదర్శి డాక్టర్ ప్రవీణ్ కుమార్, కోశాధికారి పెరుమాండ్ల రాజేష్ కుమార్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోల రాజేష్, శ్రీనివాస్, మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు చంద్రశేఖర్, మాధవరెడ్డి, పెద్ది ఆంజనేయులు, శ్రీనివాసరావు, సంతోష్, సతీష్ రెడ్డి, శేషగిరి, యాజ్దాని, విక్రమ్, వినయ్, సాయిరాజ్, మాధవి తదితరులు పాల్గొన్నారు.
Comments