మాజీ ఎంపీ మంద జగన్నాథం మరణం దేశా రాజకీయాలకు తీరని లోటు
మంద జగన్నాథానికి ఘన నివాళి
దళిత నాయకుడు డిఎస్ మహేష్
-డెస్క్, తెలంగాణ ముచ్చట్లు-
మాజీ ఎంపీ మంద జగన్నాథం మరణం దేశా రాజకీయాలకు, రాష్ట్ర రాజకీయాలకు తీరని లోటని దళిత నాయకుడు డిఎస్ మహేష్ అన్నారు. మండలం వెల్టూరు గ్రామంలో మాజీ ఎంపీ మంద జగన్నాథం చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. దేశా రాజకీయాలకు తీరని లోటని వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్పూర్తిగా కోరుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం కోసం పార్లమెంటులో తన శాయశక్తుల పోరాటం చేసిన వ్యక్తి మంద జగన్నాథమని అన్నారు. ఎంపీగా ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకుడు డిఎస్ మహేష్, మాజీ ఎంపీపీ దయాకర్, చాకలి యాదయ్య, వివేకానంద, మల్లక్ సురేష్ ప్రభాకర్, బలిద్ పల్లి అంజి, గుండెల ఆంజనేయులు, అశోక్ కుమార్, మహేంద్ర, డాక్టర్ మల్లన్న, సుంకరి యాదయ్య, బలిద్ పల్లి వెంకటేష్, చంద్రయ్య, నాగన్న తదితరులు పాల్గొన్నారు.
Comments