అట్టడుగు వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. 

అట్టడుగు వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

మెదక్ జిల్లా తెలంగాణ ముచ్చట్లు:

ఇందిరమ్మ ఇండ్ల పథకం , ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా
 జిల్లాలో పకడ్బందీగా అమలు చేసేందుకు జాబితా ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. శనివారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో చర్చించిన  ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, రైతు భరోసా  జిల్లాలో అమలు చేసే విధివిధానాలపై అధికారులతో సమీక్షించారు. 
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పథకం సర్వే జిల్లాలో 96 కంప్లీట్ చేయడం జరిగిందన్నారు. అర్హత గల నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పథకం పగడ్బందీగా  అమలు చేసే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. రైతుల సంక్షేమం, నిరుపేద కుటుంబాల అభివృద్ధి కోసం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల ప్యూరిఫికేషన్ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రైతు భరోసా పథకంలో అర్హులైన రైతుల వివరాలను క్షేత్రస్థాయిలో సమీక్షించి, లబ్ధిదారుల పేర్లను జాబితాలో చేర్చాలన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన నిరుపేదలకు ఇళ్లు కేటాయించే ప్రక్రియను కూడా వేగవంతం చేయాలన్నారు.
ప్యూరిఫికేషన్ ప్రక్రియ 16వ తేదీ నుంచి ప్రారంభించి ఈనెల 20వ తేదీ నాటికి పూర్తిచేయాలన్నారు.16వ నుండి 18వ తేదీ వరకు ఫీల్డ్ పనులు పూర్తి చేసి,19వ తేదీ నాటికి కార్యాలయంలో సమీక్ష జరిపి, తుది జాబితాను 20వ తేదీకి సమర్పించాలన్నారు.21వ నుంచి 24వ తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించి,తుది జాబితా ఆధారంగా లబ్ధిదారులను ఖరారు చేయాలన్నారు. ప్రతి మండలాన్ని రెండు భాగాలుగా విభజించి, ప్రతి భాగానికి డిప్యూటీ తహసీల్దార్‌ను బాధ్యత వహించేలానియమించాలని సూచించారు.WhatsApp Image 2025-01-11 at 9.19.51 PM (1)డిప్యూటీ తహసీల్దార్ తో పాటు సీనియర్ అసిస్టెంట్ లేదా జూనియర్ అసిస్టెంట్, ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ను కూడా ఉంచుకుని డేటాను సక్రమంగా సమీక్షించి, సరైన పద్ధతిలో సర్వేను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు జయచంద్ర రెడ్డి ,రమాదేవి, మైపాల్ రెడ్డి, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిఆర్డిఓ శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, డిఎస్ఓ సురేష్, అగ్రికల్చర్ అధికారి వినయ్ ,హౌసింగ్ పిడి మాణిక్యం   హౌసింగ్ డిఈలు, ఈఈలు, ఆయా మండలాల ఎంపీడీవోలు, వ్యవసాయ శాఖ ఏడీలు, ఏవోలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...