గొలుసు దొంగతనానికి పాల్పడిన వ్యక్తి రిమాండ్

గొలుసు దొంగతనానికి పాల్పడిన వ్యక్తి రిమాండ్


 కూకట్ పల్లి/ తెలంగాణ ముచ్చట్లు :గొలుసు దొంగతనానికి పాల్పడిన ఓ వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ సంఘటన కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎసిపి శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో నిందితుడు వివరాలను వెల్లడించారు. కృష్ణాజిల్లా పామర్రుకు చెందిన కోటి సాయి రామ్ (28) బాలాజీ నగర్ లోని నివాసం ఉంటూ సెక్యూరిటీ గా పనిచేస్తున్నాడు. ఈనెల 4వ తేదీన వివేకానంద నగర్ కాలనీలోని ఓ మహిళ మెడలోంచి 8 గ్రాముల బంగారు గొలుసును దొంగలించి పరారయ్యాడు. సదరు మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కూకట్ పల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.పోలీసుల కళ్ళు కప్పేందుకు నిందితుడు బాలానగర్ వైపు వెళ్లి అక్కడినుంచి కెపిహెచ్బి లోని పలు ప్రాంతాల్లో తిరిగి బాలాజీ నగర్ చేరుకున్నట్లు పోలీసులు తెలిపారు. 180 సీసీ కెమెరాలను పరిశీలించి నిందితున్ని పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో దొంగతనాలకు పాల్పడుతున్నట్లు నిందితుడు పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. గతంలో బైక్ దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు.నిందితుడి నుంచి ఎనిమిది గ్రాముల బంగారం బైకును స్వాధీనం చేసుకుని బుధవారం రిమాండ్ కు తరలించారు.ఈ సమావేశంలో కూకట్ పల్లి సిఐ ముత్తు,డిఐ వెంకటేశం సిబ్బంది పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...