నేల సారవంతానికి రైతులు పీఎస్బీ ని వినియోగించాలి
ఖమ్మం అర్బన్ వ్యవసాయ విస్తరణ అధికారి బాలబత్తుల శిరిణ్మయి
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
రైతులు పాస్పరస్ సాల్యూ బులైజింగ్ బ్యాక్టీరియా (పీఎస్బీ) వాడటం ద్వారా నేల సారవంతం అవుతుందని ఖమ్మం అర్బన్ వ్యవసాయ విస్తరణ అధికారి బాలబత్తుల శిరిణ్మయి అన్నారు. పీఎస్బీ వినియోగం ద్వారా వరి, పెసర పంటలలో అధిక ఆదాయాన్ని పొందవచ్ఛని అన్నారు. బుధవారం వి వెంకటయపాలెం రైతువేదికలో జాతీయ ఆహార భద్రత పథకంలో భాగంగా రైతు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఫాస్పరస్-సొల్యూబిలైజింగ్ బ్యాక్టీరియా (పీఎస్బీ) వ్యవసాయానికి, కమతాల్లో మట్టి ఆరోగ్యానికి కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.ఇవి మట్టిలో ఉన్న అసొల్యూబుల్ ఫాస్పరస్‌ను పంటలు ఆహారం తీసుకోగలిగిన సొల్యూబుల్ రూపాలకు మార్చుతాయన్నారు.
క్లస్టర్ లో ఈ పథకం ద్వారా 35 ఎకరాల్లో వరి, అపరాలు పండించే రైతులకు 50 శాతం సబ్సిడీతో పీఎస్బీని అందిస్తున్నామన్నారు. ఈ పీఎస్బీ ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Comments