శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా ప్రకటించాలి
గిరిజన యువ నాయకుడు కిషన్ నాయక్
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
గిరిజనుల ఆరాధ్య దైవం, సమాజ సంస్కర్త, మరియు ధార్మిక నాయకుడైన శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని ఫిబ్రవరి 15న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని గిరిజన యువ నాయకుడు కిషన్ నాయక్ అన్నారు. సేవాలాల్ కేవలం బంజారాల సమాజానికే కాకుండా, మొత్తం హిందూ ధర్మానికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. అహింసను ప్రాతిపదికగా తీసుకుని హింసను పాపమని, మత్తు పదార్థాలు మరియు ధూమపానం శాపమని హెచ్చరించారు. కుల, మత, వర్ణ విభజనలను నిర్మూలించి సమాజంలో సమానత్వానికి కృషి చేశారు. బంజారాల పరువు ప్రతిష్ఠను పునర్నిర్మించారు. గిరిజనుల సంచార జీవనశైలిని స్థిరీకరించి, వ్యవస్థీకృత జీవన విధానాన్ని ప్రవేశపెట్టారు. శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ బోధనలు మరియు సిద్దాంతాలు నేటి సమాజానికి కూడా మార్గదర్శకమని, ఆయన జయంతి రోజును సెలవు దినంగా ప్రకటించాలని కిషన్ నాయక్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ ఉత్సవం గిరిజనుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేలా, సమాజంలోని ప్రతి వర్గానికి సేవాలాల్ మహారాజ్ యొక్క ఆధ్యాత్మిక, సామాజిక విశిష్టతను చాటి చెప్పేందుకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.
Comments