సుజాత విద్యానికేతన్ లో సంక్రాంతి సంబరాలు
హసన్ పర్తి,తెలంగాణ ముచ్చట్లు;
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ హసన్ పర్తి 66వ డివిజన్ కేంద్రంలోని సుజాత విద్యానికేతన్ పాఠశాలలో సంక్రాంతి పండుగ సందర్భంగా రంగోలి ముగ్గుల పోటీలు పాఠశాల ప్రిన్సిపల్ ఆకుతోట శాంతరాం కర్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు,విద్యార్థులు సంక్రాంతి పాటలతో కోలాటాలు భోగిమంటలు వేసి చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోసి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పిల్లలు వేసిన ముగ్గులు సందర్శకులను ఆకట్టుకున్నాయి. అనంతర సమావేశంలో పాఠశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ భారతదేశం యొక్క సంస్కృతి,సంప్రదాయాలు ఆచార వ్యవహారాలు భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరి పైన ఉందని అన్నారు.పర్యావరణ మిత్ర యూనిట్ ఆధ్వర్యంలో సుజాత విద్యానికేతన్ అనేక పర్యావరణహిత కార్యక్రమాలు నిర్వహించిందని అందులో భాగంగానే సంక్రాంతి పండుగను వినూత్నంగా భోగిమంటలు, భోగి పళ్ళు,కోలాటాలు,రంగవల్లులతో వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో 66వ డివిజన్ టిఆర్ఎస్ అధ్యక్షుడు పాపిశెట్టి శ్రీధర్,కాంగ్రెస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు కనపర్తి కిరణ్, వింజమూరు వెంకటేశ్వర్లు,పుల్లా రవీందర్,ఉపాధ్యాయులు,విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comments