సేవా దృక్పథంతో పని చేయాలి.... 

జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

సేవా దృక్పథంతో పని చేయాలి.... 

-ప్రజలకు వేగవంతంగా సేవలు అందించాలి

-విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

-వేంసురు మండలంలో తనిఖీలు నిర్వహించిన జిల్లా కలెక్టర్

ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:

ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజల పట్ల సేవా దృక్పథంతో పని చేసి, ప్రభుత్వ వైద్య సేవల పట్ల విశ్వాసం కల్పించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు.

గురువారం వేంసూర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని, మండల తహసిల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

ఆసుపత్రిలో డ్రగ్స్ (మందుల)నిల్వల సద్వినియోగం, గర్భిణీ మహిళలకు అందుతున్న సేవలు, ఆసుపత్రి నిర్వహణ మొదలగు వివిధ అంశాలను కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఆసుపత్రికి వచ్చే రోగులతో సిబ్బంది ప్రవర్తన, రెస్పాన్స్ అయ్యే విధానం మరింత మెరుగ్గా ఉండాలని, మనం ప్రజలకు సేవ చేయడం కోసం ఉన్నామనే ఆలోచనా విధానంతో పని చేయాలని, పేషెంట్లతో మర్యాదగా ప్రవర్తించడం, సేవా దృక్పథంతో పని చేయడం వైద్య శాఖలో చాలా అవసరమని అన్నారు. 

ఆసుపత్రి సిబ్బంది అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడానికి వీలు లేదని, ఆసుపత్రి సిబ్బంది సకాలంలో హాజరు కావాలని అన్నారు. ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాల గురించి, ఎన్ని సాధారణ, సిజేరియన్ ఆపరేషన్లను చేసింది అడిగి తెలుసుకున్నారు. సాధారణ ప్రసవాలు ప్రోత్సహించాలని, ఈ దిశగా మొదటి నుండే గర్భిణిలకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని, ప్రసవం దగ్గరికి వచ్చిన గర్భిణీ మహిళను ఎప్పటికప్పుడు ఫాలో అప్ చేయాలని అన్నారు. మందుల వివరాలు ఎప్పటి కప్పుడు అప్డేట్ చేసుకొని, ప్రభుత్వ ఆసుపత్రులలో ఎక్కడా మందుల కొరత ఉండటానికి వీల్లేదని అన్నారు.

ల్యాబరేటరీ పరిశీలించి, ఎన్ని రకాల పరీక్షలు చేపడుతున్నది అడిగి తెలుసుకున్నారు. ల్యాబరేటరీ లో పరీక్షలకు కావాల్సిన పరికరాలు, మందుల లభ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. టేలీమానస్ నిర్వహణ గురించి, ఆసుపత్రిలో సౌకర్యాలు, సమస్యల గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. 

అంతకుముందు జిల్లా కలెక్టర్ మండల తహసిల్దార్ కార్యాలయాన్ని సందర్శించారుWhatsApp Image 2025-01-16 at 8.56.54 PM తహసిల్దార్ కార్యాలయంలో సిబ్బంది పని తీరుపై అనేక ఫిర్యాదులు అందుతున్నాయని, పద్ధతి మార్చుకోకపోతే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని కలెక్టర్ హెచ్చరించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడం పట్ల సహించమని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రజలకు సేవలు నిర్ణీత కాలంలోగా అందజేయాలని, ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఫిర్యాదులు వస్తే సహించేది లేదని, కఠిన చర్యలు ఉంటాయని కలెక్టర్ అన్నారు.

కలెక్టర్ పర్యటన సందర్భంగా వేంసూరు మండల తహసీల్దార్ ఎం.ఏ. రాజు,  వైద్యాధికారులు డా. కె. ఇందు ప్రియాంక, డా. కె. శ్రీవిద్య, డా. ఎస్కె. హసీనా,  సంబంధిత అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...