కార్య‌క‌ర్త‌ల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటాం

హ‌నుమ‌కొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దాస్యం విన‌య్ భాస్క‌ర్. 

కార్య‌క‌ర్త‌ల‌ను కంటికి రెప్ప‌లా కాపాడుకుంటాం

హసన్ పర్తి,తెలంగాణ ముచ్చట్లు;

కార్యకర్తలను,వారి కుటుంబాలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని బీఆర్ఎస్ పార్టీ హ‌నుమ‌కొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం విన‌య్ భాస్క‌ర్  అన్నారు.హ‌స‌న్‌ప‌ర్తి మండ‌లం బైరాన్‌ప‌ల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ ముల‌క‌ల‌ప‌ల్లి కుమార‌స్వామి ఇటీవ‌ల మ‌ర‌ణించగా పార్టీ స‌భ్య‌త్వ బీమా  రెండు ల‌క్ష‌లు చెక్కు రాగా దాస్యం విన‌య్ భాస్క‌ర్  వ‌డ్డేప‌ల్లిలో తన ఇంటి వ‌ద్ద సోమ‌వారం రోజున చెక్కును కుమార‌స్వామి భార్య స‌విత‌కు అంద‌జేశారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు, వారి కుటుంబాల‌కు అండ‌గా బీఆర్ఎస్ పార్టీ  ఉంటుంద‌ని తెలిపారు. పార్టీకి బ‌లం కార్య‌క‌ర్త‌లే అని, పార్టీని క‌ష్ట‌కాలంలో అంటిపెట్టుకొని ఉన్న వారికి మంచి రోజులు వ‌స్తాయ‌ని అన్నారు. పార్టీ కార్య‌క‌ర్త‌ల క‌ష్ట‌సుఖాలు తెలిసే ప్ర‌మాద బీమా సౌక‌ర్యాన్ని ఉచితంగా పార్టీ క‌ల్పించింద‌ని వివ‌రించారు.ఈ కార్య‌క్ర‌మంలో బైరాన్‌ప‌ల్లి గ్రామ మాజీ  సర్పంచ్ కుందూరు సాంబరెడ్డి,పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బైరి మధుకర్ రెడ్డి ,పీఏసీఎస్ మల్లారెడ్డి పల్లె సొసైటీ వైస్ చైర్మన్ ములకలపల్లి జయశంకర్, గ్రామ శాఖ మాజీ అధ్యక్షుడు గోగుల శ్రీనివాస్,జట్టి రాజేందర్, పిడుగు రాజేందర్, యాదగిరి, శివకుమార్, యాకుబ్ పాషా త‌దిత‌రులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...