సర్వజ్ఞ పాఠశాలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు
జాగ్రత్తలకు మారుపేరు 'సర్వజ్ఞ'
అన్నింటిలోనూ ముందే 'సర్వజ్ఞ'
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
ఖమ్మం నగరంలోని వీడియోస్ కాలనీలోని సర్వజ్ఞ పాఠశాలలో రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. సర్వజ్ఞ పాఠశాల అన్నిటిలోనూ ముందే ఉంటుంది అనడానికి నిదర్శనంగా చెప్పవచ్చు. జనవరి 7న విద్యార్థులందరితో రోడ్డు భద్రత గురించి ర్యాలీ చేయడం జరిగింది. విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు "వేగం కన్నా, ప్రాణం మిన్న" అనే నినాదంతో విద్యార్ధులందరూ "హెల్మెట్ లేని ప్రయాణం నేరం" అని, ట్రాఫిక్ రూల్స్ ను అందరూ పాటించాలని గుర్తు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ ఎస్ఐ సాగర్ బాబు పాల్గొని ట్రాఫిక్ రూల్స్ సిగ్నల్స్ గురించి చక్కగా వివరించారు. దేశంలో ప్రతి సెకన్ కు ముగ్గురు రోడ్డు ప్రమాదంలోనే ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. నిర్లక్ష్యంగా వాహనాలను నడుపుతూ కన్న వాళ్లకు జీవితాంతం కన్నీళ్లను మిగాల్చవద్దని, ప్రతి ఒక్కరు నిబంధనలను పాటిస్తే రోడ్డు ప్రమాదాలు ఉండవని అన్నారు. అలాగే సర్వజ్ఞ పాఠశాల డైరెక్టర్ ఆర్ వి నాగేంద్ర కుమార్ పాల్గొని రోడ్డు భద్రతా నియమాలను ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించాలని సూచించారు. వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్టు పెట్టుకోవాలని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపరాదని వివరించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ తల్లిదండ్రులతో బయటకు వెళ్ళినప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా వాడేలా చూసుకోవాలని చెప్పారు. దీని వలన అందరం క్షేమంగా ఉంటామని తెలియజేశారు. "అతివేగం ప్రమాదకరం" అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్స్ ఆర్.వి. నాగేంద్ర కుమార్, నీలిమా, ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయేతర సిబ్బంది పాల్గొనడం జరిగింది.
Comments