బాలానగర్ డివిజన్ అభివృద్ధే మాకు ముఖ్యం..

ఏ బ్లాక్ ఉపాధ్యక్షుడు మాదిరెడ్డి యుగంధర్ రెడ్డి...

బాలానగర్ డివిజన్ అభివృద్ధే మాకు ముఖ్యం..

కూకట్పల్లి/ తెలంగాణ ముచ్చట్లు:
నగరాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేస్తుందని కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ ఉపాధ్యక్షుడు మాదిరెడ్డి యుగంధర్ రెడ్డి అన్నారు. బుధవారం బాలానగర్ డివిజన్ లోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేయనున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ చౌహాన్ పరిశీలించారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం అయ్యేంతవరకు బాలానగర్ ప్రాంతవాసులు ఫతేనగర్ డివిజన్ కు సంబంధించిన హిందూ స్మశాన వాటికలోకి వెళ్లడానికి రోడ్డు మధ్యలో ఇబ్బందులు ఎదురవుతున్న కారణంగా అక్కడ మనుషుల రాకపోకలకు డివైడర్ గేట్ ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. పక్కనే ఉన్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు గ్రీనర్ ఏర్పాటు చేయాలని కోరడం జరిగిందని అన్నారు. సాయి నగర్ నుండి బొజ్జయి కళ్యాణ మండపం వరకు ఆసంపూర్తిగా మిగిలిపోయిన నాలా రిటైనింగ్ వాల్ బెడ్ పనులను చేపట్టేందుకు ప్రతిపాదన చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ ఛైర్మన్ లక్ష్మయ్య ,డివిజన్ అధ్యక్షుడు మధుగౌడ్, మేడ్చల్ డిస్ట్రిక్ట్ ఫిషరీస్ కమిటీ వైస్ చైర్మన్, బాలానగర్ ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు ఆకుల నరేందర్, సీనియర్ నాయకులు పులి శ్రీకాంత్ పటేల్, పులి శివకుమార్ గౌడ్, కూకట్ పల్లి డివిజన్ అధ్యక్షులు మేకల రమేష్, ఫతేనగర్ డివిజన్ అధ్యక్షుడు కుక్కల రమేష్, బందీగా బలనర్సింహ, మాదరి శ్రీనివాస్, ముక్తార్ అహ్మద్, కూకట్ పల్లి నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గజానంద్ శేఖర్, రవిగౌడ్, కుమార్, సదాగౌడ్, వివిధ కాలనీ వాసులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...