విద్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు:
జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్ జిల్లా తెలంగాణ ముచ్చట్లు:
గురువారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని చికోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను,షెడ్యూల కులాల బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. ముందుగా విద్యార్థుల భోజనశాలను, స్టోర్ రూమ్ను పరిశీలించారు మెనూ అమలు తీరును జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయు లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరగతి గదిలో కలెక్టర్ టీచర్ గా మారి పాఠాలు బోధించి ప్రశ్నలతో విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ విద్య వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నదని, అందులో భాగంగానే మెనూ సమర్థవంతంగా అమలు చేసున్నామని తెలిపారు విద్యార్థులు ఉన్నత చదువులు చదివి రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట చీకోడు జిల్లా పరిషత్ హై స్కూల్
ప్రధానోపాధ్యాయురాలు, సంబంధిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు
Comments