జీతాలు లేక పూట గడవక

ఆవేదన చెందుతున్న కార్మికులు

జీతాలు లేక పూట గడవక

జోగులాంబ గద్వాల్ తెలంగాణ ముచ్చట్లు

రాజోలి మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు తెలంగాణ పాశుద్ధ కమిటీల పంచాయితీ కార్మికుల ధర్నా జరిగింది ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా యుటిఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షులు తిప్పన్న సిపిఎం పార్టీ మండల కార్యదర్శి విజయకుమార్ మాట్లాడుతూ మూడు నెలలకు అవుతున్న ఇంతవరకు కార్మికులకు వేతనాలు రావడంలేదని చాలీచాలని బ్రతుకులతో జీవనం పోషిస్తున్న కార్మికులకు జీతాలు నెల నెల వచ్చేటట్టు ఇవ్వాలని పొద్దున నుంచి సాయంత్రం వరకు గ్రామాన్ని మురికి కాలువలు శుభ్రం చేస్తూ రోడ్లు ఊడుస్తూ దుర్గంధపు వాసన లెక్క చేయకుండా అనారోగ్యాల పాలై కష్టపడి పని చేస్తున్న పారిశుద్ధ కార్మికులకు ఇంతవరకు జీతాలు రావడం లేదని కార్మికులకు నెలనెలా జీతాలు వచ్చేటట్టుకు అధికారులు కృషి చేయాలని అలాగే తూర్పు గార్లపాడు లోని కార్మికులకు ఐదు నెలల దాటిన ఇంతవరకు వారికి వేతనాలు ఇవ్వడం లేదని దుకాణాలకు వెళితే ఉద్దర సరుకులు ఇవ్వడం లేదని దుకాణదారులు కార్మికుల నమ్మే స్థితిలో లేరని తక్షణమే పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే చెల్లించాలని నాయకులు అన్నారు ఈ కార్యక్రమంలో తెలంగాణ పారిశుద్ధ కమిటీ గ్రామకార్యదర్శి  లక్ష్మన్న అధ్యక్షులు తిక్కన్న కోశాధికారి సత్తార్మియా సహాయ కార్యదర్శి కృష్ణ ఉపాధ్యక్షులు సౌలు రాజు కమిటీ సభ్యులు పుల్లన్న శశి రెడ్డి నరసన్న చిన్న దస్తగిరి డ్రైవర్ రవి నడిపన్న మాభూమియా పెద్ద దస్తగిరి దుబ్బన్న గార్లపాడు మద్దిలేటి కార్మికులు పాల్గొన్నారు అనంతరం ఎంపీడీవో ఖాజావలి  పంచాయతీ కార్యదర్శి కృష్ణ  వినతి పత్రం ఇవ్వడం జరిగింది

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...