ఆదర్శ కులాంతర వివాహాలు చేసుకోవడంలో యువత ముందుండాలి.
డి.వై.యఫ్.ఐ పూర్వ జిల్లా నాయకులు వై.విక్రమ్ పిలుపు.
-డి.వై.యఫ్.ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 76వ ఆదర్శ వివాహం నిర్వహణ.
ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:
ఆదర్శ కులాంతర వివాహాలు చేసుకోవడంలో యువత ముందుండాలనీ,పౌరసమాజం కులంతర ఆదర్శ వివాహాలను ప్రోత్సహించాలనీ డి.వై.యఫ్.ఐ జిల్లా పూర్వ నాయకులు వై.విక్రమ్,రిటైడ్ లెక్చరర్ టీ.లక్ష్మినర్సయ్య లు పిలుపునిచ్చారు. స్థానిక సుందరయ్య భవన్ లో రఘునాధపాలెం మండలం పువ్వాడ నగర్ కి చెందిన సాయి గణేష్,యామిని లకు డి.వై.యఫ్.ఐ ఖమ్మం జిల్లా కమిటీ చేగువేరా ఆదర్శ వివాహ వేధిక ఆధ్వర్యంలో 76వ ఆదర్శ వివాహం నిర్వహించడం జరిగింది.ఈ వివాహ వేడుకకు ఆచార్యులుగా రిటైడ్ లెక్చరర్ టీ.లక్ష్మినర్సయ్య,చింతల.రమేష్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ వివాహ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డి.వై.యఫ్.ఐ జిల్లా పూర్వ నాయకులు వై.విక్రమ్,దొంగల.తిరుపతి రావు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షురాలు పిన్నిటి.రమ్య లు పాల్గొని మాట్లాడుతూ నేడు సమాజంలో నిజమైన ప్రేమికులకు రక్షణ లేకుండా పోయిందని,కులాంతర వివాహం చేసుకునే వారిపై కొందరు దాడులకు పాల్పడుతున్నారని పరువు హత్యలు చేస్తున్నారని అలాంటి సంఘటనలను అందరూ వ్యతిరేకించాలని వారు అన్నారు.ఆదర్శ కులాంతర వివాహాలు చేసుకోవడంలో యువత ముందుండాలని,కులాంతర,మతాంతర వివాహాలు చేసుకునే వారికి రక్షణ చట్టం తేవాలని,సంక్షేమ పథకాలు ప్రత్యేక అవకాశం కల్పించాలని వారు ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.కులాంతర వివాహాలతో కుల నిర్మూలనకు కొంత కృషి జరుగుతుందని అందుకే ఆదర్శ కులాంతర వివాహాలు చేసుకోవడంలో యువత ముందుండాలనీ, పౌరసమాజం కులంతర ఆదర్శ వివాహాలను ప్రోత్సహించాలనీ నిజమైన ప్రేమికులకు అండగా డి.వై.యఫ్.ఐ చేగువేరా ఆదర్శ వివాహ వేధిక ఉంటుందనీ వారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో డి.వై.యఫ్.ఐ జిల్లా నాయకులు కొంగర.నవీన్,కూచిపూడి.నరేష్,షేక్.ఇమామ్,మట్ట.ప్రసన్న, నాగేశ్వరరావు, యస్.యాఫ్. ఐ నాయకులు వినోద్,వెంకట్ వధూవరుల స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు.
Comments