ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ
ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు
-- వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్
వనపర్తి ,తెలంగాణ ముచ్చట్లు:
వనపర్తి శాసనసభ్యులు తుడి మేఘా రెడ్డి ఆదేశాల మేరకు పెద్దమందడి మండలంలో వనపర్తి మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, పెద్దమందడి మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్ మంగళవారం పెద్దమందడి మండల కేంద్రంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ..మార్కెట్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని గత పాలకుల మాదిరిగా ఎలాంటి పక్షపాతం చూపబొమని ఇందిరమ్మ ఇల్లు లబ్ది దారులకు తప్పకుండ ఇస్తామని ,విపక్షాలు చెప్పే మాటలు నమ్మి మోసపోవదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ కొత్తకాపు రామకృష్ణ రెడ్డి పెద్దమందడి మాజీ ఎంపీపీ రఘు ప్రసాద్, మాజీ జెడ్పిటిసి వెంకట స్వామి, పెద్దమందడి మాజీ సర్పంచ్ వెంకటస్వామి, టైలర్ రవి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Comments