వనపర్తి కి తరలి వెళ్లిన వెల్టూర్ కాంగ్రెస్ శ్రేణులు

వనపర్తి కి తరలి వెళ్లిన వెల్టూర్ కాంగ్రెస్ శ్రేణులు

వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు: 

 ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వనపర్తి  పర్యటనలో భాగంగా వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి పిలుపుమేరకు పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి (బంగ్లా బాబు) ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు వనపర్తి కి తరలి వెళ్లారు. వనపర్తి లో కళ్యాణ సాయి ఫంక్షన్ హాల్ లో జరిగే కార్యకర్తల సమావేశానికి  గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో వెల్టూరు గ్రామం నుంచి పెద్ద ఎత్తున వాహనంలో కాంగ్రెస్ నాయకులు తరలి వెళ్లారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి కృషితో నియోజకవర్గం లో పలు అభివృద్ధి పనులకు  ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయని, ఇట్టి కార్యక్రమాలకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తో పాటు నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎంపీ మల్లురవి, వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి ,జిల్లా మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రణాళిక ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి లు హాజరై పలు విద్యుత్ సబ్ స్టేషన్లకు ప్రారంభోత్సవాలు మరియు కార్యకర్తల సమావేశానికి తరలి వెళ్తున్నట్టు జగదీశ్వర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు జగదీశ్వర్ రెడ్డి, యువ నాయకుడు వడ్డే శేఖర్, సీనియర్ నాయకులు ఆర్ శ్రీనివాస్ రెడ్డి, గుండెల ఆంజనేయులు, పట్నం సత్యన్న, అనంత రెడ్డి, ప్రేమ్ సాగర్, నాగభూషణ్, డి అశోక్, పట్నం దశరథ, బండి చంద్రయ్య, గుండెల శుభాష్, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది పేదల పాలిట సీఎం రిలీఫ్ ఫండ్.. ఓ వరం లాంటిది
* ఖమ్మం ఎంపీ క్యాంపు కార్యాలయంలో ఎల్ఓసీ పత్రం అందజేత  ఖమ్మం బ్యూరో, తెలంగాణ ముచ్చట్లు:  పేదలు, మధ్యతరగతి ప్రజానీకం అత్యవసర వైద్య సేవలు పొందేందుకు.. ముఖ్యమంత్రి...
ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి.. 
సేవా దృక్పథంతో పని చేయాలి.... 
కొత్తగూడెం ఎయిర్ పోర్టు స్థల పరిశీలనకు ఈ నెల 23న రాక 
హలో మాదిగ.. చలో హైదరాబాద్ 
ప్రభుత్వ తోడ్పాటుతో మహిళలు ఆర్థికంగా బలపడాలి... 
మైనారిటీస్ గురుకుల పాఠశాలలు, కళాశాలల్లో చేరుటకు దరఖాస్తు చేయాలి...