రక్తదానం ప్రాణదానంతో సమానం
గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, డీసీసీబీ డైరెక్టర్,పిఏసిఎస్ చైర్మన్
ధర్మసాగర్,తెలంగాణ ముచ్చట్లు
రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఆపదలో ఉన్న వారికి అత్యవసర పరిస్థితుల్లో రక్తం కావాల్సిన వారిని కాపాడేందుకు ప్రతి ఒక్కరు రక్తదానం చేయాలని డీసీసీబీ డైరెక్టర్, ధర్మసాగర్ డీసీసీబీ డైరెక్టర్,ధర్మసాగర్ మండల ప్రాధమిక వ్యవసాయ కో ఆపరేటివ్ సొసైటీ అధ్యక్షుడు గుండ్రెడ్డి రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. జనవరి 1న తన పుట్టినరోజు సందర్భంగా ధర్మసాగర్ మండల కేంద్రంలోని సుష్మిత గార్డెన్‌లో రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న రాజేశ్వర్ రెడ్డి రక్తదాతలకు సర్టిఫికేట్‌లు, పండ్లు, రసాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “అన్ని దానాల్లోకీ రక్తదానం అత్యంత గొప్పదని, ఇది ప్రాణాలకు ప్రాణం పోసే సేవ” అని అన్నారు. ప్రతి రక్తదానం ఒక ప్రాణాన్ని రక్షించే సాధనమని, రక్తదాతలు ప్రాణాదాతలుగా నిలుస్తున్నారని ఆయన ప్రశంసించారు.
రక్తదానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన సుమారు 100మంది రక్తదాతలను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఈ శిబిరాన్ని విజయవంతం చేసిన నిర్వాహకులకు, సహకారం అందించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. “నా పుట్టినరోజు ఈ విధంగా సార్ధకమవ్వడం ఎంతో ఆనందంగా ఉంది” అని రాజేశ్వర్ రెడ్డి అన్నారు.ఈ మెగా రక్తదాన శిబిరం ధర్మసాగర్ మండలంలో రక్తదానం పై అవగాహన పెంచడం మాత్రమే కాక, ఈ ఆచరణ ద్వారా మరెన్నో ప్రాణాలను రక్షించేందుకు ప్రేరణగా నిలిచింది.
Comments