ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిఎస్ మహేష్
వనపర్తి, తెలంగాణ ముచ్చట్లు:
పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు డి ఎస్ మహేష్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతమ్ ను మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. బుధవారం హైదరాబాదులోని ఎస్సీ కార్పొరేషన్ చాంబర్లో చైర్మన్ ప్రీతం ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం ఎస్సీ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి వెల్టూర్ గ్రామానికి 60 యూనిట్లు మంజూరు చేయాలని వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా డిఎస్ మహేష్ మాట్లాడుతూ... ఎస్సీ కార్పొరేషన్ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తి చేసుకుని లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపిందని, దళితుల ఆర్థిక, అభివృద్ధి , స్వయం ఉపాధికి ఎస్సీ కార్పొరేషన్ కృషి చేసిందని అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వెల్టూరు గ్రామానికి 60 యూనిట్లు మంజూరు చేస్తే దళితుల ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని, వినతి పత్రం అందజేయడం జరిగిందని డిఎస్ మహేష్ తెలిపారు.
Comments