ఆర్యవైశ్య సంఘం మండల అధ్యక్షుడిగా అంచూరి యుగేందర్
జఫర్గడ్ ,తెలంగాణ ముచ్చట్లు :మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష పదవికి ఆదివారం స్థానిక వైశ్య సంఘం హాలులో జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గంగిశెట్టి ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో
ఎన్నికలు నిర్వహించారు.మొత్తం 199ఓట్లు ఉండగా,
అధ్యక్ష పదవి కోసం అంచూరి యుగంధర్ ,బజ్జూరి మణికాంత్ ఇరువురు పోటీపడడం జరిగింది.వీరిరువురు హోరా హోరీగా ప్రచారం సైతం చేసుకోవడం జరిగింది.ఉదయం 10 గంటలకు ప్రారంభమైనఎన్నికలు మధ్యాహ్ననం 2 గంటల వరకు కొనసాగిన ఈ ఎన్నికలలో మొత్తం .176 ఓట్లు పోలయ్యాయి. అంచూరి యుగంధర్ కు 89, బజ్జూరు మణికాంత్ కు 87 ఓట్లు పోలు అయినట్లు ఎన్నికల అధికారి మాధవిశెట్టి వరూధిని తెలిపారు. దీంతో రెండు ఓట్లతో అంచూరి యుగంధర్ గెలుపొందడం జరిగిందని వారు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఎన్నికల అధికారులు గన్ను నర్సింలు, బెజగం బిక్షపతి, గంగిశెట్టి అనూజ, జిల్లా యూత్ అద్యక్షులు గజ్జి సంతోష్ కుమార్ , గందే లిరిల్ కుమార్,గంద సోమన్న,శ్రవణ్ కుమార్,పడకంటి రవీందర్,,సరభు అంజనేయులు,మశెట్టి వేణుగోపాల్ తదతరులు పాల్గొన్నారు.
Comments