హైదరాబాదు పబ్లిక్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

రైతుల అనుమతి లేకుండా బలవంతపు భూసేకరణ సిగ్గుచేటు

హైదరాబాదు పబ్లిక్ స్కూల్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

  2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలి                                                                                                              డిమాండ్ చేసిన జిల్లా ఎస్సీ,ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు                               

హనుమకొండ/
ధర్మసాగర్, తెలంగాణ ముచ్చట్లు:

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ఎల్కూర్తి గ్రామంలో హైదరాబాదు పబ్లిక్ స్కూల్ యాజమాన్యం అమాయక దళిత రైతులను మోసం చేసి, 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘిస్తూ బలవంతంగా భూములు సేకరిస్తున్నట్లు జిల్లా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు చుంచు రాజేందర్, పుట్టరవి, రడపాక పరంజ్యోతి పేర్కొన్నారు.

వారు మాట్లాడుతూ, “భూములకు భూమి ఇవ్వకుండా, మార్కెట్ రేటు ప్రకారం నష్ట పరిహారం చెల్లించకుండా గత బిఆర్ఎస్ ప్రభుత్వం అండదండలతో అధికారులు దళిత రైతులను దోపిడీ చేశారని” ఆగ్రహం వ్యక్తం చేశారు.
శుక్రవారం, ఎల్కూర్తి గ్రామం నుంచి దళిత రైతులతో కలిసి హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావిణ్యకి వినతిపత్రం సమర్పించారు. వారు ఈ సందర్భంగా “గత ప్రభుత్వం దళిత రైతుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించింది, భూములపై అనుమతి లేకుండా సేకరణ జరిపింది, ఇది పూర్తిగా అంగీకరించదగినది కాదు” అని పేర్కొన్నారు.ఈ భూసేకరణ చట్టం ప్రకారం, “ప్రభుత్వం మూడు సంవత్సరాల్లో భూములు స్వాధీనం చేసుకోకపోతే, తిరిగి భూములు రైతులకు ఇవ్వాలని” వారు డిమాండ్ చేశారు.

“హైదరాబాదు పబ్లిక్ స్కూల్ యాజమాన్యం భూములను బలవంతంగా గుంజుకుంటూ, భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించింది” అని వారు ఆరోపించారు.వారు రాష్ట్ర రెవెన్యూ మంత్రి, జిల్లా కలెక్టర్, నియోజకవర్గ ఎమ్మెల్యే నుండి వెంటనే స్పందించి, ఎల్కూర్తి దళిత రైతులకు న్యాయం చేయాలని కోరారు. “హైదరాబాదు పబ్లిక్ స్కూల్ భూముల కోసం బలవంతంగా భూములు సేకరిస్తున్న దళిత కుటుంబాల పిల్లలకు ఉచిత విద్యను అందించాలి. భూ బాధితులకు 1000 గజాల స్థలం, స్కూల్ లో ఉద్యోగం.మార్కెట్ రేటు ప్రకారం నష్ట పరిహారం ఇవ్వాలి” అన్నారు.

ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాదాసి సురేష్, అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాదాసి అబ్రహాం తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

No comments yet.

Latest News

జనగాం డిఇఓ దర్శనం భోజన్‌ని  సన్మానించిన చిరంజీవి నాయక్  జనగాం డిఇఓ దర్శనం భోజన్‌ని  సన్మానించిన చిరంజీవి నాయక్ 
జనగాం,తెలంగాణ ముచ్చట్లు: జనగాం జిల్లా విద్యాశాఖ అధికారిగా తాజాగా(డీఈఓ) బాధ్యతలు స్వీకరించిన దర్శనం భోజన్‌ని ఘనంగా స్టేషన్ ‌ఘన్‌పూర్ నియోజకవర్గ బిఆర్ఎస్వీ ఇంచార్జీ లకావత్ చిరంజీవి ఆయన...
మే 31న మెగా హెల్పింగ్ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవం
వేచరేణి ఎల్ల దాసు నగర్ సంఘటనను ఖండించిన బీజేపీ
పరీక్ష రాసి వస్తుండగా రోడ్డు ప్రమాదం… అక్కాచెల్లెళ్లు దుర్మరణం
వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హన్మకొండలో నిరసన
పిల్లల్లో క్రమశిక్షణకు విబిఎస్ ఎంతగానో ఉపయోగపడుతుంది
ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం