స్మార్ట్‌ ఫోన్‌ పోతే.. యూపీఐ ఐడీల పరిస్థితి ఏంటి.?

స్మార్ట్‌ ఫోన్‌ పోతే.. యూపీఐ ఐడీల పరిస్థితి ఏంటి.?

హైదరాబాద్,తెలంగాణ ముచ్చట్లు:

ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ వినియోగం భారీగా పెరిగిపోయింది. ప్రతీ ఒక్కరి చేతిలో ఫోన్‌ కచ్చితంగా ఉండే పరిస్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా డిజిటల్ చెల్లింపులు పెరిగిన తర్వాత స్మార్ట్‌ ఫోన్‌ లేనిది రోజు గడవని పరిస్థితి వచ్చింది. అయితే ప్రతీ రోజూ వేలల్లో లావాదేవీలు చేసే యాప్స్‌ఉండే ఫోన్‌ ఎక్కడైనా పడిపోయినా, లేదా ఎవరైనా దొంగలించినా అప్పుడు పరిస్థితి ఏంటి.? ఈ సందేహం ఎప్పుడైనా వచ్చిందా.? ఒకవేళ నిజంగానే మీ ఫోన్‌ పోయిందనుకోండి. మీ ఫోన్‌లోని యూపీఐ ఐడీలను బ్లాక్‌ చేసే అవకాశం ఉంటుంది
 ప్రస్తుతం గూగుల్ పే, ఫోన్‌పే వంటి ఎన్నో రకాల యాప్స్‌ అందుబాటులో ఉన్నాయి. మరి వీటిని బ్లాక్‌ ఎలా చేయాలి.? మన దగ్గర ఫోన్‌ ఉంటే ఇట్టే యాప్స్‌ను డీయాక్టివేట్ చేసుకోవచ్చు. కానీ ఫోన్‌ లేకపోతే పరిస్థితి ఏంటి.? ఇందుకోసం కూడా ఓ మార్గం ఉంది. యూపీఐ ఐడీని నిమిషాల్లోనే సులభంగా బ్లాక్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా కొన్ని టోల్‌ ఫ్రీ నెంబర్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటికి కాల్‌ కాసి కొన్ని వివరాలు తెలిజేయడం ద్వారా మీరు మీ యూపీఐ ఐడీని బ్లాక్‌ చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో హ్యాకింగ్ కూడా ఎక్కువవుతోంది. యూపీఐ ఐడీలను హ్యాక్‌ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అలాంటి వారు కూడా ఈ నెంబర్లకు కాల్ చేసిన యూపీఐ ఐడీని బ్లాక్‌ చేసుకుకోవచ్చు.

ఎలా బ్లాక్‌ చేయాలంటే..

ఒకవేళ మీరు గూగుల్ పే ఉపయోగిస్తున్నట్లయితే.. మీరు 1800-419-0157 నెంబర్‌కు కాల్‌ చేయాల్సి ఉంటుంది. అదే విధంగా పేటీఎమ్‌ ఉపయోగిస్తున్నట్లయితే 01204456456 నెంబర్‌కు కాల్‌ చేయాలి. ఇవి టోల్‌ ఫ్రీ నెంబర్స్‌. ఈ నెంబర్లకు కాల్ చేసిన తర్వాత కస్టమర్ కేర్‌ ప్రతినిధులతో మాట్లాడాల్సి ఉంటుంది. అయితే ఈ సమయంలో సదరు యూపీఐ ఐడీ మీదేనా కాదా.? అనే విషయాన్ని నిర్ధారించుకోవడానికి అవతలివైపు నుంచి కొన్ని ప్రశ్నలు అడుగుతారు. వాటికి సమాధానాలు చెప్పడం ద్వారా మీ యూపీఐ ఐడీని సులభంగా బ్లాక్‌ చేసుకోవచ్చు.

Tags:

Related Posts

Post Your Comments

Comments

No comments yet.

Latest News

జనగాం డిఇఓ దర్శనం భోజన్‌ని  సన్మానించిన చిరంజీవి నాయక్  జనగాం డిఇఓ దర్శనం భోజన్‌ని  సన్మానించిన చిరంజీవి నాయక్ 
జనగాం,తెలంగాణ ముచ్చట్లు: జనగాం జిల్లా విద్యాశాఖ అధికారిగా తాజాగా(డీఈఓ) బాధ్యతలు స్వీకరించిన దర్శనం భోజన్‌ని ఘనంగా స్టేషన్ ‌ఘన్‌పూర్ నియోజకవర్గ బిఆర్ఎస్వీ ఇంచార్జీ లకావత్ చిరంజీవి ఆయన...
మే 31న మెగా హెల్పింగ్ ఫౌండేషన్ అవార్డుల ప్రదానోత్సవం
వేచరేణి ఎల్ల దాసు నగర్ సంఘటనను ఖండించిన బీజేపీ
పరీక్ష రాసి వస్తుండగా రోడ్డు ప్రమాదం… అక్కాచెల్లెళ్లు దుర్మరణం
వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా హన్మకొండలో నిరసన
పిల్లల్లో క్రమశిక్షణకు విబిఎస్ ఎంతగానో ఉపయోగపడుతుంది
ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆర్థిక సహాయం